Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మానసిక ఒత్తిడి ఒక పరిస్థితి యొక్క పర్యవసానం కాదు – అది మన వ్యవస్ధను సరిగా నిర్వహించుకోలేని అసమర్దత యొక్క పర్యవసానం.
ఈర్ష్యా ద్వేషాల మూలతత్వం అసంపూర్ణతా భావం. మీరు నిజంగా ఆహ్లాదంగా ఉంటే, ఎవరి పట్లా మీరు ఈర్ష్యతో ఉండరు.
మీరెవరన్నది పరిస్థితులు నిర్దారించక, మీరే పరిస్థితులు ఎలా ఉండాలో నిర్ధారిస్తున్నప్పుడు – అదే విజయం.
కావాలనుకుంటే, ఈ క్షణంలో మీరు ఆనందంగా ఉండగలరు. కేవలం మీరీ ఎంపిక చేసుకోవాలి అంతే.
మనలో సరైన వాతావరణం సృష్టించుకోగలిగితే, మనందరికీ ఆహ్లాదంగా, అంతర్గత శ్రేయస్సుతో జీవించే సామర్ధ్యం ఉంది
మీరు శాశ్వతంగా ఉండరన్న ఎరుక నిరంతరం ఉన్నప్పుడే, మీరు పూర్తి ఎరుకతో ఉంటూ జీవితంలోని ప్రతి క్షణం ఆస్వాదించగలరు.
భూమాత ఒడిలో మన మంతా పోషింపబడుతున్నాము. సహజంగానే మనం ఆమె పట్ల భక్తి భావంతో ఉండాలి.
మీ మనసు ఒక అగ్ని గోళం లాంటిది. మీరు దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే, అది సూర్యునిలా కాగలదు.
భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతిదీ ప్రాధమికంగా ఒక విధమైన అల. మీరు మంచి నావికులైతే, ప్రతి అలా ఒక అవకాశమే.
భవిష్యత్తు గురించి భయ పడకండి. మీ వర్తమానాన్ని బాగా నిర్వహించుకోండి, ఇక భవిష్యత్తు వికసిస్తుంది.
నా వరకు, జీవితం అంటే మీరేమి చేస్తున్నారన్నది కాదు, దాన్ని ఎలా చేస్తున్నారనేదే అసలు విషయం.
మీరు ఏమి చేస్తున్నా, కాస్త పరిశీలించుకోండి – అదంతా మీ కోసమా లేక అందరి శ్రేయస్సు కోసమా అని. మంచి కర్మా, చెడ్డ కర్మా అన్న సందిగ్ధమేమైనా ఉంటే ఇది దాన్ని పటాపంచలు చేస్తుంది.