Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
మనకెంత యోగ్యత, సామర్థ్యం, ప్రతిభ ఉన్నప్పటికీ, అవన్నీ కూడా సమతుల్యం ఉన్నప్పుడే అర్థవంతంగా ఉంటాయి.
ధ్యానలింగం, పూర్తి స్థాయి శక్తి శరీరంతో ఉన్న పరమోత్తమ జీవి లాంటిది. శివుడే స్వయంగా ఇక్కడ ఆసీనులై ఉన్నారు.
భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పార్శ్వాల్లో యోగా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే విషయం ఏమిటంటే, మీరు అది చెయ్యాలి.
జీవితంలో మీరు పురోగతి సాధిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే, మీరు నిన్నటి కన్నా ఈ రోజు మరికాస్త సంతోషంగా ఉన్నారా అని చూసుకోండి, చాలు.
మీరిప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నదానిపై మీకు పూర్తి స్పష్టత ఉంటే, ఆ తరువాతి స్థాయి అనుభవం దానంతట అదే మీకు ప్రకటితమౌతుంది.
ప్రజలు విజయవంతులు అవుతున్నారంటే, అది కఠిన శ్రమ వల్లనే కానక్కరలేదు. వాళ్ళు దాన్ని సరిగ్గా సఫలీకృతమయ్యే విధంగా చేయడం వల్ల.
మీ మనసులో, భావోద్వేగాల్లో, శరీరంలో మీకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోగలిగితే, మీ ఆరోగ్యం, ఆనందం, సంక్షేమం అన్నీ వాటంతట అవే వస్తాయి.
మీకిష్టమైన వాటి పరిమితుల్లో ఉండడం కన్నా, మీ పరిమితుల్ని అధిగమించి వెళ్ళడం మరెంతో ముఖ్యం.
జీవితపు వైరుధ్యం ఇదే: మీరు లెక్కలేనన్ని అసత్యాలను సృష్టించవచ్చు, కానీ సత్యం మాత్రం ఒక్కటే.
తగినంత శ్రద్ధ పెడితే, దాదాపు దేనిపైనైనా పట్టు సాధించొచ్చు.
జీవం గురించి లోతైన అవగాహన పొందాలంటే, మీపై ఇతరులకున్న అభిప్రాయాలు మీకు ఏమాత్రం పట్టకూడదు.
కష్టకాలాలను మీరు అంతర్గత హుందాతో ఎదుర్కోగలిగితే, ఎదురయ్యే ప్రతి పరిస్థితీ జీవితాన్ని మెరుగుపరచుకోగల అవకాశమేనని మీరు గ్రహిస్తారు.